nellore crime: వారి చూపు పడితే దుకాణం ఖాళీ అయిపోవాల్సిందే. మూడున్నరేళ్ల వ్యవధిలో 20 దుకాణాల్లోని 50లక్షల సామాగ్రి లూటీ చేశారు. నెల్లూరులో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు దొంగలను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ దొంగలను విచారించిన పోలీసులు, వీరి చోరీ జాబితా చూసి నివ్వెరపోయారు. కావలి ప్రాంతానికి చెందిన మాధవరావు, చంద్రశేఖర్ తో పాటు ఓ మైనర్ బాలుడు కలిసి మూడున్నరేళ్లుగా నెల్లూరు, కావలి, వెంకటాచలం ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దాదాపు 20 దుకాణాల్లో రూ.50 లక్షల విలువైన సామాగ్రిని వీరు దోచుకున్నారు. ప్రధానంగా గోదాములను ఎంచుకొని వాటిని కొల్లగొడుతున్నారు.
nellore crime: నెల్లూరు జిల్లాలో ముగ్గురు దొంగలు అరెస్ట్ - నెల్లూరు జిల్లా నేర వార్తలు
nellore crime: నెల్లూరు జిల్లాలో ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారు ఇప్పటి వరకు రూ. 50 లక్షల సామాగ్రిని లూటీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
పట్టుబడ్డ ఈ దొంగల నుంచి మూడు లక్షల విలువచేసే బట్టలు, రూ.3.71 లక్షల ఎలక్ట్రానిక్ సామాన్లు, రూ. 1.10 లక్షల ఎలక్ట్రికల్ గూడ్స్, 1.35 లక్షల విలువచేసే ప్రోవిజన్స్, పెస్టిసైడ్స్ తోపాటు ఏడు ఆక్సిజన్ సిలిండర్లు, మూడు మోటారు సైకిళ్ళు, రెండు ఆటోల తోపాటు రూ.15 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరు ఏటీఎం కేంద్రాల్లోనూ వీరు దొంగతనానికి పాల్పడినట్లు ఏఎస్పీ వెంకటరత్నం వెల్లడించారు. దొంగలను పట్టుకున్న పోలీసులను ఆమె అభినందించారు.