ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి - కోవూరులో కరోనా మృతులు

నెల్లూరు జిల్లా కోవూరులో వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనాతో మరణించగా..మరొకరు వైరస్​తో పోరాడుతున్నారు. అతడి పరిస్థితి విషమించడంతో.. స్థానికులు, వాలంటీర్ 108 కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి పంపించారు.

కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి
కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

By

Published : May 9, 2021, 11:42 PM IST

కరోనా ధాటికి వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ ఘటన జరిగింది. మురళీకృష్ణ అనే వ్యక్తి తల్లి ఈనెల ఒకటిన, తండ్రి నాలుగున, అక్క ఆరో తేదీన కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో మిగిలిన మురళీకృష్ణ సైతం కొవిడ్ సోకి బాధపడుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో..స్థానికులు, వాలంటీర్, ఏఎన్ఎం 108 కి సమాచారమివ్వగా వారు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details