పూరి గుడిసెకు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా.. మూడు మేకలు మృతి చెందాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో జరిగింది. గ్రామానికి చెందిన మండెం పెంచలయ్య మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. రాత్రి వర్షం రావడంతో అందరు ఇంటిలో పడుకున్నారు. గుర్తుతెలియని దుండగులు మేకలున్న గుడిసెకు నిప్పుపెట్టారు. పూరిగుడిసె పూర్తిగా కాలిపోగా.. మూడు మేకలు చనిపోయాయి. మరో రెండు మేకలు గాయపడ్డాయి. మేకలు మృతిచెందడంతో పెంచలయ్య కన్నీరుమున్నీరుగా విలపించాడు. తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
పూరిగుడిసెకు నిప్పుపెట్టిన దుండగులు... మూడు మేకలు మృతి - three goats at shankaranagaram news
మేకలున్న గుడిసెకు నిప్పుపెట్టడంతో మూడు మేకలు మృతిచెందాయి. రెండు మేకలు గాయపడ్డాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో జరిగింది.
శంకరనగరంలో అగ్నివ్రమాదం