Teenage Students Missing: నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ముగ్గురు బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి పదో తరగతి విద్యార్థినులు యాకసిరి అంకిత, మల్లికా జ్యోతి, నాగమణి కనిపించడం లేదు. వారి అదృశ్యంతో ఆందోళన చెందిన పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయులు అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాపూరు మండలంలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపుతోంది. వారు ఎక్కడికి వెళ్లారు. ఏమైపోయారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే పాఠశాలలో చదివే బాలికలు అనేక సార్లు తప్పిపోయారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు - పదవ తరగతి అమ్మాయిలు అదృష్యం
Teenage Students Missing: నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే ముగ్గురు విద్యార్థినులు సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి కనిపించడం లేదు. వారి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది.

Teenage Students Missing
Last Updated : Jan 24, 2023, 12:20 PM IST