నెల్లూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గూడూరు, నాయుడుపేట డివిజన్లలో ఉదయం 6 :30 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుంది. 15 మండలాల్లో 267 పంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఓట్లు వేసేందుకు జనాలు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలివస్తున్నారు. మర్లపల్లి పంచాయతీలో పరదాలు కట్టి పోలింగ్ నిర్వహించారు. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కేంద్రాల వద్ద వసతులు సరిగా లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
నెల్లూరులో ప్రశాంతంగా మూడోదశ ఎన్నికల పోలింగ్
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో మూడోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
నెల్లూరులో ప్రశాంతంగా మూడోదశ ఎన్నికల పోలింగ్
TAGGED:
naidupeta