నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయం పక్కనే ఉన్న సచివాలయం భవనంలో దొంగలు పడ్డారు. కార్యాలయం తాళాలు పగలగొట్టి నానా బీభత్సం సృష్టించారు. బీరువాలో ఉన్న ముఖ్యమైన ఫైళ్ళను కింద పడేసి, లోపల ఉండే పలు బీరువాలు తాళాలు పగలగొట్టి అన్నిటినీ గాలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ప్రధాన తలుపు తాళం పగలకొట్టి లోపల ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. కార్యాలయం తెరిచేందుకు వచ్చిన అధికారులు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సచివాలయం, ఆర్డీఓ కార్యాలయాల్లో పరిస్థితిని గమనించిన అధికారులు విలువైన ఫైళ్లు మాయమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడి.. ఏం ఎత్తుకెళ్లారంటే...? - Thieves in government offices at nellore district news update
ఇప్పటి వరకు ఇళ్లు.. గుడిలో.. బ్యాంకులు.. ఏటీఎంల్లో దొంగలు బీభత్సం సృష్టించడం చూసుంటారు. నెల్లూరు జిల్లాలో మాత్రం దుండగులు ఈసారి ప్రభుత్వ కార్యాలయాలపై పడ్డారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో తిప్ప మీద ఉన్న ఆర్డీఓ కార్యాలయం, పక్కనే ఉన్న సచివాలయం భవనంలో దొంగలు నానా బీభత్సం సృష్టించారు.
![ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడి.. ఏం ఎత్తుకెళ్లారంటే...? Thieves in government offices](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8112026-984-8112026-1595328546102.jpg)
ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు
TAGGED:
దొంగల బీభత్సం తాజా వార్తలు