నెల్లూరులో ఓ ఘరానా దొంగను.... వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 18.50 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 25న వేదయపాలెంలోని లాట్ షోరూం గోడకు కన్నం వేసి సెల్ ఫోన్స్ దొంగలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వెంకటాచలం మండలానికి చెందిన శివనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గతంలోనూ ఇతడు పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. లాట్ షోరూమ్ చోరీకి సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని తేల్చే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘరానా దొంగ అరెస్ట్... 18.50 లక్షల సొత్తు స్వాధీనం - Thief Arrested
ఓ ఘరానా దొంగను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 18.50 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఘరానా దొంగ అరెస్ట్