నెల్లూరు జిల్లా కోవూరు పట్టణం బండారుమాన్యం కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు తమ ప్రతాపం చూపుతున్నారు. ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 60గ్రాముల బంగారు ఆభరణాలు, 15వేల రూపాయల నగదును చోరీ చేశారు. . కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు అయిదు రోజుల క్రితం వేమారెడ్డి రాధిక కుటుంబ సభ్యులు నెల్లూరులో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం వేసిన ఉండటాన్ని గుర్తించిన తలుపులు పగలగొట్టి అందినకాడికి దోచుకుపోయారు. నేడు తిరిగి ఇంటికి వచ్చిన యజమానులు విషయం గ్రహించి పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ.. 60గ్రాముల బంగారం, 15వేల నగదు అపహరణ - కోవూరులో దొంగతనం
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అందినకాడికి దోచుకున్నారు దొంగలు. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ ఘటన జరిగింది.
దొంగతనం