ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ - నెల్లూరు జిల్లా నేర వార్తలు

నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పట్ట పగలే చోరీ జరిగింది. బంగారం, నగదును దొంగలు దోచుకువెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బీరువాలోని నగలను ఎత్తుకెళ్లిన దొంగలు
బీరువాలోని నగలను ఎత్తుకెళ్లిన దొంగలు

By

Published : Feb 18, 2021, 8:24 AM IST

నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో కేంద్రంలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలోని మంగళవీధిలో నివాసముంటున్న జయమ్మ అనే మహిళ.. బంధువులను చూసేందుకు నెల్లూరుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో సామాన్లు చెల్లచెదురుగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించింది. తలుపులు పగల గొట్టి బీరువాలో ఉన్న ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోవూరు ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details