ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెచ్చిపోయిన దొంగలు.. ఆలయాల్లో చోరీ! - నెల్లూరు

అనంతసాగరంలో దొంగలు మరోసారి చెలరేగిపోయారు. రామాలయం, అభయాంజనేయ స్వామి, వినాయక స్వామి, సాయిబాబా ఆలయాల్లో హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు.

ఆలయాల్లో చోరీ
ఆలయాలు

By

Published : Aug 28, 2021, 10:13 AM IST

Updated : Aug 28, 2021, 2:53 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. రామాలయం, అభయాంజనేయ స్వామి, వినాయక స్వామి, సాయిబాబా ఆలయాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 4 ఆలయాల్లో స్వామివారి హుండీలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు.

హుండీలు ఆలయం వెనుకపడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. చోరీ జరిగిందని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన నెల వ్యవధిలో 9 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు స్దానికులు తెలుపుతున్నారు.

కృష్ణాజిల్లా నూజివీడులోని ఓ దేవాలయంలో అర్ధరాత్రి అగంతకులు హుండీ దొంగిలించిన ఘటన సంచలనం రేపింది. కొత్తూరు గ్రామంలోని శ్రీరామమందిరంలోగల హుండీని గుర్తు తెలియని అగంతకులు అర్ధరాత్రి దొంగిలించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో గడచిన రెండేళ్లుగా హుండీని తీయలేదని స్థానికులు తెలియజేస్తున్నారు. హుండీలో సుమారుగా రూ. 25 వేలు ఉంటాయని గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గండేపల్లిలో దొంగల హల్‌చల్‌.. పలు ఆలయాల్లో చోరీ

Last Updated : Aug 28, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details