ఇదీ చూడండి:
'శ్మశాన వాటికలో ఇళ్ల స్థలాలు వద్దు' - అధికారులతో గొడవకు దిగిన గ్రామస్థులు
ఉగాది నాటికి పేదలందరికి ఇళ్లస్థలాలు అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలాల సేకరణలో అధికారులకు అడుగడునా చిక్కులు ఎదురవుతన్నాయి. వివాదంలో ఉన్న స్థలాలు, శ్మశాన వాటికల స్థలాలను అధికారులు ఎంపిక చేస్తుండడంపై నెల్లూరు జిల్లా సంగం మండలం తల్పూరుపాడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందూ శ్మశాన వాటిక ఉన్న స్థలంలోనే ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జేసీబీతో స్థలాన్ని చదును చేసేందుకు వచ్చిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. అలాంటి స్థలాలు వద్దని చెప్పారు.
అధికారులతో గొడవపడుతున్న గ్రామస్థులు