నెల్లూరు జిల్లా కోట మండలం వీరారెడ్డిసత్రం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ బాషా అధిక రక్తపోటుతో మృతిచెందాడు.మరణించిన అనంతరం మృతదేహాన్నిఅద్దెకున్న ఇంటికి తీసుకొచ్చేందుకు గ్రామస్థులు ఒప్పుకోలేదు.కరోనా భయంతో గ్రామస్థులందరూ మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురావటానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఒప్పుకోలేదు. ముస్లీం మత పెద్దలు మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడే అంతిమ యాత్రకు సంబంధించిన పనులు పూర్తి చేశారు.
'కరోనా భయం..శవాన్ని రానియ్యం'
మరణం మనిషి జీవితంలో ఆఖరి ఘట్టం...అయినోళ్లు చనిపోతే కడసారి చూసేందుకు అందరూ వస్తారు... కాని...శవాన్ని ఇంటికి తీసుకురావటానికే వీల్లేందంటూ..గ్రామస్థులంతా ఒక్కటై మృతదేహాన్ని స్మశాన వాటికకు పంపించారు.కరోనా వైరస్ భయం మనిషిని ఎంత దిగజారుస్తుందో తెలియటానికి నెల్లూరు జిల్లా కోట మండలం వీరారెడ్డిసత్రం గ్రామంలో జరిగిన ఈ ఘటన చూస్తే చాలు....
The villagers clashed over not allowing the deadbody into the village in nellore dst