ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రయాన్-2 పై చిన్నారులకు అవగాహన - chandrayaan2

ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్​-2 ప్రయోగంపై చిన్నారుల్లో జ్ఞానాన్ని పెంచే ప్రయత్నం చేసింది యూటీఎఫ్. వారికి ఈ ప్రయోగంపై అవగాహన కలిగేలా పరీక్షలు నిర్వహించారు. వారితోనే ప్రయోగం గురించి మాట్లాడించారు.

విద్యార్థులు

By

Published : Jul 14, 2019, 10:34 PM IST

చంద్రయాన్-2 ప్రయోగంపై చిన్నారులకు అవగాహన

నెల్లూరు జిల్లా నాయుడుపేట టంగుటూరు ప్రకాశం పంతులు పాఠశాలలో యూటీఎఫ్​ (యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో విద్యార్థులకు చంద్రయాన్-2 ప్రయోగంపై అవగాహన కల్పించారు. మాట్లాడటం, రాయటంలో వారికి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు చంద్రయాన్-2 ప్రయోగ విషయాలను అనర్గళంగా ప్రసంగించారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా హావభావాలు ప్రదర్శిస్తూ మాట్లాడారు. ప్రయోగం విజయవంతం కావాలని కోరారు. కాగా.. జిల్లాలోని శ్రీహరికోట నుంచి జులై 15 తెల్లవారుజామున 2.51 గంటలకు జీఎస్​ఎల్​వీ మార్క్​-3 ద్వారా చంద్రయాన్​-2 జాబిల్లిపైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details