నెల్లూరు జిల్లా ఎడగారు సీజన్లో వరి పండించిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప... క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం ఉన్నాయని ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు 25 శాతం తేమ ఉన్నా.. 960 కిలోలు ఇచ్చి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రైతులకు సైతం సరే అన్నాా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
వారు చెప్పిన రేట్లకే అమ్మాలి..
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లినప్పుడు తేమ శాతం 25 గా... క్వింటాకు వంద కిలోలు ఎక్కువగా ఇవ్వాలంటూ మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. దిగుబడులు భారీగా తగ్గిన పరిస్థితుల్లో.. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మూల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిందని.. అది ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప... ఆ నిధులు ఖర్చు పెట్టడం లేదని రైతులు తెలిపారు.
ప్రభుత్వం విఫలం..