నెల్లూరు జిల్లాకు కేటాయించిన రూ.11 కోట్లతో 500 యూనిట్లను మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేపలు, రొయ్యల ఉత్పత్తి, మార్కెటింగ్ విధానం, వాటికి సోకే వ్యాధులు గుర్తించడం.. ఈ మూడు రకాల యూనిట్లకు రాయితీ రుణాలు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఒక్కో యూనిట్‌కు 60 శాతం రాయితీ ఉంటుంది. దీనిలో కేంద్రం 24 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 36 శాతం భరిస్తాయి. ఓసీలు, బీసీలకు 40 శాతం రాయితీ ఉంటుంది. దరఖాస్తుదారులు కచ్చితంగా ఏదైనా సొసైటీలో సభ్యుడిగా ఉంటేనే రుణాలు మంజూరవుతాయని మార్గ దర్శకాలు చెబుతున్నాయి.
పథకాల వివరాలు
సముద్రంలో వేటకు వెళ్లే వారికి ఇన్సూరెన్సు చేయనున్నారు.రొయ్యలకు సోకే వైరస్ పరిశీలన ప్రయోగశాలల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ.35 లక్షలుగా నిర్ణయించారు.
●*చేపల కుంటలు, ఉప్పు నీటి కయ్యలు, చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సాయం అందించనున్నారు. రెండు హెక్టార్లలో సాగు చేసుకునే వారికి రూ.18 లక్షలు రుణం అందుతుంది. ఈ యూనిట్లలో 10 శాతం బయో ప్లాక్ విధానాన్ని అమలు చేయాలి. చేపలు, రొయ్యలకు సహజసిద్ధంగా ఆహారం అందించడమే బయో ప్లాక్ విధానం ముఖ్య ఉద్దేశం. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫలితంగా చేపలు, రొయ్యల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
● పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్‌కు రూ.18 లక్షల రుణం అందనుంది. అధునాతన కోల్ట్ స్టోరేజీలు, సముద్రం ఉత్పత్తులు దెబ్బతినకుండా చేపలు, రొయ్యలతో పచ్చళ్లు, బిర్యాని, కట్‌లెట్స్, ఊరగాయలు వంటి యూనిట్లు ఏర్పాటుచేసుకునే వెసులుబాటు ఉంది. విలువ ఆధారిత పరిశ్రమ యూనిట్లు మంజూరు చేస్తారు. చిన్న యూనిట్లనూ ప్రోత్సహిస్తున్నారు. వీటికి రూ.75 వేల రుణమిస్తారు. ఐస్, చిల్లింగ్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకోవచ్ఛు చేపలు విక్రయించే వారిని ప్రోత్సహించేందుకు మోటార్ సైకిల్, ఐస్ బాక్సును ఇస్తారు.