నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని పలు దేవాలయాల్లో దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కావలికి చెందిన నడింపల్లి గోపి కొమ్మలపాటి, గోవర్ధన్ ఇద్దరు హుండీల చోరీకి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఓ గుడిలో చోరీకి యత్నించి విఫలమవగా.. పక్కనే ఇంట్లో బంగారు గొలుసు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఇద్దరినీ పట్టుకున్న పోలీసులు.. వారికి పదేళ్ల నేర చరిత్ర ఉందని గుర్తించారు. కేసు నమోదు చేశారు.
దేవాలయాల్లో చోరీలు.. పోలీసులకు చిక్కిన దొంగలు - కావలిలో ఆలయ దొంగల అరెస్ట్ వార్తలు
ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పది సంవత్సరాల నేరచరిత్ర ఉందని తెలిపారు.
![దేవాలయాల్లో చోరీలు.. పోలీసులకు చిక్కిన దొంగలు The police who arrested the temple robbers at nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5526584-459-5526584-1577589740066.jpg)
మీడియాతో మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసాద్