నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 4 గంటల్లో ఛేదించారు. సింగరాయకొండకు చెందిన 13 ఏళ్ల బాలిక.. తన బాబాయ్ తో కలిసి నెల్లూరులోని అమ్మమ్మ ఇంటికి 10 రోజుల క్రితం బయల్దేరింది. మార్గమధ్యంలో మర్రిపాడు బైపాస్ రోడ్డు దగ్గర వీరిద్దరు ఓ లారీ ఎక్కారు.
లారీ డ్రైవర్ సంగం చెక్‌పోస్టు దగ్గర బాబాయిని వదిలేసి, బాలికను కిడ్నాప్ చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 గంటల్లో కేసును ఛేదించారు. నెల్లూరు జాతీయ రహదారి పై ఉన్న లారీని గుర్తించి.. బాలికను రక్షించారు. 62 ఏళ్ల లారీ డ్రైవర్ సుబ్బరాయుడును అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు.