వలస కూలీల కోసం నెల్లూరులో ఏర్పాటు చేసిన ఓ పునరావాస కేంద్రంలో పరిస్థితులు కరోనా వ్యాప్తి భయాలను రేకెత్తిస్తున్నాయి. నగరంలోని కలెక్టర్ బంగ్లాకు సమీపంలో ఉన్న బారాషాహీద్ దర్గా పునరావాస కేంద్రంలో భౌతిక దూరం పాటించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిశుభ్రత గురించి కూడా పట్టించుకోవడం లేదని అందులో ఉంటున్న వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముగ్గురికి ఆరోగ్యం దెబ్బతినగా మరోచోటికి తరలించారు. ఆహారం కూడా అందరికీ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అర్థరాత్రి అభాగ్యులు పడుతున్న అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
పునరావాస బాధితుల గోడు..పట్టించుకునే నాథుడెవ్వరు..!
పునరావాస కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అందులో ఉన్న వారు నానా అవస్థలు పడుతున్నారు. నెల్లూరులోని ఓ పునరావాస కేంద్రంలో భౌతికదూరం పాటించకుండా సామూహిక నిద్ర చేస్తున్నారు. దీంతో కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరు పునరావాస కేంద్రంలో వలసకూలీల అవస్థలు