ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీ విగ్రహానికి అవమానం.. జనసేన నాయకుల పాలాభిషేకం - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు నగరంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అవమానించారు. విషయం తెలుసుకున్న జనసేన నేతలు విగ్రహాన్ని శుభ్రపరచి, పాలతో అభిషేకించారు.

the-insult-to-the-statue-of-mahatma-gandhi-in-nellore
మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం.. జనసేన నాయకుల పాలాభిషేకం

By

Published : Jun 25, 2020, 3:53 PM IST

నెల్లూరు నగరంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని అల్లరిమూకలు అవమానపరిచాయి. కళ్ల జోడు తీసేసి, రంగులు చల్లారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు విగ్రహాన్ని శుభ్రం చేసి, పాలతో అభిషేకించారు.

మహాత్ముడి విగ్రహానికి కళ్ళజోడు, చేతి కర్రను తిరిగి అమర్చారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతీయ నాయకుల విగ్రహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details