కృష్ణపట్నం చేరుకున్న ఆయుష్ బృందం..ఔషద తయారీ విధానంపై ఆరా - నెల్లూరు జిల్లా వార్తలు
18:55 May 21
నెల్లూరు ఆయుర్వేద ఔషధం శాస్త్రీయ నిర్ధారణ కోసం ఆయుష్ బృందం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ఆనందయ్య తయారుచేసే ఔషధాన్ని పరిశీలించారు.
సీఎం జగన్ సూచనతో నెల్లూరు ఆయుర్వేద ఔషధం శాస్త్రీయ నిర్ధారణ కోసం ఆయుష్ బృందం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకున్నారు. ఆనందయ్య ..ఆయుర్వేద ఔషధం తయారు చేసే చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. ఔషధ తయారీ విధానంను ఆనందయ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ మందుతో ఏమైనా దుష్ఫలితాలు వస్తాయా ? అనే విషయం ఆయుష్ బృందం ఆరా తీసింది. ఈ బృందం వెంట నెల్లూరు జేసీ హరేంద్రప్రసాద్, డీపీవో ధనలక్ష్మీ ఉన్నారు.
ఇదీ చదవండి