Former minister Narayana bail cancellation case: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌పై లోతైన విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఆదేశాలిచ్చింది.
హైకోర్టులో మాజీమంత్రి నారాయణకు ఊరట..
Former minister Narayana: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కేసును సెషన్స్ కోర్టు మళ్లీ విచారించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలుజారీ చేసింది.
నవంబర్ 30లోపు మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ లో నారాయణ ప్రమేయం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. 2014లోనే ఆయన నారాయణ సంస్థల ఛైర్మన్ పదవి కి రాజీనామా చేశారని కోర్టుకు తెలిపారు. బెయిల్ ఇచ్చిన విషయాన్ని సెషన్స్ కోర్టు కూడా తప్పుబట్టలేదన్నారు. పోలీసులు నమోదు చేసిన ఒక సెక్షన్ చెల్లదనే కారణంతోనే మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. బెయిల్ రద్దు ఉత్తర్వులను కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు. విచారణ దశలోనే బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు ఉత్తర్వులిచ్చింది.
ఇవీ చదవండి: