నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో గుడికి వెళ్లిన మహిళ కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని వ్యక్తి బంగారపు గొలుసు చోరీకి ప్రయత్నించాడు. ఆరు సవర్ల బంగారు గొలుసులో సగం కంటే ఎక్కువ భాగాన్ని దుండగడు లాక్కొని పరారయ్యాడు. ఉదయగిరిలోని స్టేట్ పేట కాలనీలో నివాసముండే భోగి రెడ్డి రమణమ్మ ఐదేళ్లుగా విద్యుత్ కేంద్రం వద్ద ఉండే నాగారప్పమ్మ ఆలయం వద్ద ప్రతి రోజు పూజలు చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుడి వద్ద పూజలు చేస్తుండగా... గుర్తు తెలియని వ్యక్తి వెనక వైపు నుంచి వచ్చి రమణమ్మ మెడలోని బంగారపు గొలుసు లాగే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేయగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. చివరికి ఆమె కళ్లలో కారం కొట్టిన దుండగుడు.. గొలుసులోని కొంత భాగాన్ని తెంపి లాక్కుని పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై ముత్యాలరావు తెలిపారు.
కళ్లలో కారం కొట్టి... మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం - ఉదయగిరిలో మహిళ మెడలోని బంగారం గొలుసు చోరీకి యత్నం
గుర్తు తెలియని వ్యక్తి.. మహిళ కళ్లలో కారం కొట్టాడు. ఆమె మెడలోని బంగారపు గొలుసు చోరీకి యత్నించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో జరిగింది.
ఉదయగిరిలో మహిళ మెడలోని బంగారం గొలుసు చోరీకి యత్నం