వాయిదాలు చెల్లించలేదని ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థ దివ్యాంగుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కనికరం లేకుండా నాయుడుపేట రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలి అతని వాహనాన్ని తీసుకెళ్లారు. దిక్కుతోచని స్థితిలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆ దివ్యాంగుడు స్టేషన్ ఆవరణలో కాలం వెల్లదీస్తున్నాడు.
జాలి లేని ఫైనాన్స్ కంపెనీ... దివ్యాంగుడి వాహనాన్ని తీసుకెళ్లి... - నాయుడు పేట స్టేషన్లో దివ్యాంగుడి వార్తలు
అతనో దివ్యాంగుడు. అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా తన మూడు చక్రాల మోటర్ సైకిల్‌పై పండ్లు అమ్ముతూ..ఇంటింటికి పేపర్ వేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కరోనా వైరస్ వల్ల పరిస్థితి అంతా తలకిందులైంది. జీవనోపాధి కరవై..ఇంటి అద్దె చెల్లించలేక చివరికి తన మోటార్ సైకిల్‌పై రుణం తీసుకున్నాడు. చేయటానికి పనులు దొరకకపోవటంతో వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోయాడు. ఫైనాన్స్ కంపెనీ వారు దివ్యాంగుడిపై ఏ మాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై అతన్ని వదిలి పెట్టి వాహనాన్ని తీసుకెళ్లారు.
![జాలి లేని ఫైనాన్స్ కంపెనీ... దివ్యాంగుడి వాహనాన్ని తీసుకెళ్లి... the finance company that took disabled vehicle at naidu pet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10338296-1091-10338296-1611318293728.jpg)
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని భరత్ నగర్లో మునికృష్ణ అనే దివ్యాంగుడు నివాసముంటున్నాడు. తనకున్న మూడు చక్రాల వాహనంపై పండ్లు అమ్ముతూ..పేపర్ వేస్తూ జీవిస్తున్నాడు. కరోనా వైరస్ వల్ల ఉపాది కోల్పోయాడు. పనుల్లేక ఇంటి అద్దె చెల్లించేందుకు దివ్యాంగుడు మూడు చక్రాలు మోటారు సైకిల్‌పై రూ.17వేలు రుణం పొందాడు. దివ్యాంగుడనే కనీస కనికరం లేకుండా.. వాయిదా కట్టలేదని అతన్ని నడిరోడ్డుపై దించేసి వాహనం తీసుకెళ్లారు. నెల రోజులు గడువు కోరనా కనికరించలేదు.
ఇదీ చదవండి:రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ