ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు బాలిక అత్యాచార ఘటనలో వెలుగులోకి నిజాలు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

తండ్రిలా ఆదరించాల్సిన మేనమామ మనువాడాడు. భర్తనంటూ శారీరకంగా తనపై అధికారం చెలాయించాలని చూస్తే.. 13ఏళ్ల ఆ చిన్నారి తట్టుకోలేక పోయింది. తననేం చేస్తున్నాడో అర్థంకాక.. గట్టిగా కేకలు పెడుతూ.. ఆ రాక్షసుడి చెరనుంచి బయటపడాలని యత్నించింది. అటుపై...

Nellore Minor Girl Rape case
నెల్లూరు మైనర్ బాలిక అత్యాచార ఘటనలో బయటపడ్డ నిజాలు

By

Published : Mar 2, 2021, 8:38 PM IST

నెల్లూరు జిల్లా కొత్తూరులో "దారుణం.. 13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి"ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక గిరిజన కాలనీకి చెందిన మానికల చిన సుబ్బయ్య అనే 45 ఏళ్ల వ్యక్తికి వివాహం అయి.. నలుగురు పిల్లలు ఉన్నారు. పదేళ్ల కిందట భార్య వదిలి వెళ్లిపోవటంతో.. అక్క వద్ద ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో తన సోదరి కూమార్తె అయిన 13ఏళ్లు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు.

అనంతరం అక్కడి నుంచి దంపూరు వెళ్లి ఉంటున్నాడు. అయితే బాలికను శారీరకంగా కలవాలంటూ ఒత్తడి చేయగా.. ఆమె భయపడి అరపులు పెట్టింది. దీంతో చుట్టుపక్కల వారు స్పందించి ఆమెను కాపాడారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నెల్లూరు మైనర్ బాలిక అత్యాచార ఘటనలో బయటపడ్డ నిజాలు

ఇదీ చదవండీ..దారుణం.. 13 ఏళ్ల బాలికపై 50 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి

ABOUT THE AUTHOR

...view details