ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనికరించని అధికారులు.... కాలిపోతానంటున్న వృద్ధుడు

ఆ వృద్ధుడికి నా అనుకున్నవారు ఎవ్వరూ లేరు... ఒక కాలు, చేయి పనిచేయవు. అలాంటి వ్యక్తి గత 8 నెలలుగా దివ్యాంగుల సర్టిఫికేట్ కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాడు. అతని స్థితిని చూసి జాలిపడాల్సిన అధికారులు... రేపు మాపు అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఇక చేసేదేమి లేక... చూసే దిక్కులేక మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన వృద్ధుడు
పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన వృద్ధుడు

By

Published : Jun 11, 2020, 5:02 PM IST

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన వృద్ధుడు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఓ వృద్ధుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని కాపాడారు. ఆత్మకూరుకు చెందిన మేకల ఆనందరావుకి ఎవరూ లేరు. దానికి తోడు గత కొంతకాలంగా కాలు, చేయి పనిచేయడం లేదు. వయసు కూడా 62 ఏళ్లు రావటంతో వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని అధికారులను కోరాడు. అయితే అతన్ని దివ్యాంగుల సర్టిఫికేట్ తీసుకురావాలని అధికారులు సూచించారు. 8 నెలల కిందట 'మీ సేవ'లో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాడు. అప్పటినుంచి కాళ్లు అరిగేలా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి ఎన్ని సార్లు వెళ్లిన అధికారులు పట్టించుకోలేదు. కొన్ని రోజులు ఇక్కడ సిబ్బంది లేరంటూ కాలం వెళ్లదీశారు. ఆ తర్వాత మూడు నెలలపాటు లాక్​డౌన్​లో సర్టిఫికెట్లు మంజూరు చేయబోమని చెప్పారు. చివరకు ఇక్కడ సిబ్బంది లేరంటూ ఆ వృద్ధుడి దరఖాస్తును గూడూరు ఆసుపత్రికి ట్రాన్స్​ఫర్​​ పెట్టారు. ఆ విషయం తెలిసినా వృద్ధుడు ఏమి చేయాలో అర్థం కాక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తనకంటూ ఎవరూ లేరని అధికారుల చుట్టూ తిరిగేందుకు ఇంకా ఓపిక కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి:తండ్రి, కుమార్తెపై మారణాయుధాలతో దాడి!

ABOUT THE AUTHOR

...view details