ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్ - నెల్లూరు జిల్లాలో పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్

ఆత్మహత్య చేసుకున్న భర్త మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించటానికి అష్టకష్టాలను పడింది ఓ మహిళ. ఒకవైపు భర్త చనిపోయాడనే బాధ, మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను.. పోస్టుమార్టం చేయాటానికి లంచం అడిగాడు వైద్యుడు. డబ్బులు ఫోన్​పే చేస్తేనే శవ పంచనామా చేస్తానని డిమాండ్ చేశాడు. దిక్కు తోచని ఆ మహిళ తన గోడును మీడియాతో వెల్లడించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

మహిళ
మహిళ

By

Published : May 4, 2022, 9:28 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న ఓ కూలీకి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. బ్రతుకు పోరాటంలో ఊరు కానీ ఊరు వచ్చారు. కొన్ని రోజులుగా తాము పనిచేస్తున్న యజమాని.. సరిగా డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర వత్తిడికి లోనయ్యాడు ఓ వ్యక్తి. రెండు రోజులుగా ఎంతో మనోవేదన చెందాడు. అప్పులతో పూట గడవడం కష్టంగా మారింది. అంతా కష్టాల్లోనూ యజమాని డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ ఆలోచించి భార్యకు కూడా ఏమి చెప్పకుండా తోటలోకి వెళ్లి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్తను కోల్పోయి పట్టెడు దుఖంలో ఉన్న ఆ మహిళకు డాక్టర్ రూపంలో మరో కష్టం తలుపుతట్టింది. భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. శవపంచనామాకు లంచం అడిగాడు ఆ వైద్యుడు. చేతిలో చిల్లి గవ్వలేదని ఆమె వాపోయింది. ఎలాగైన తమ భర్తకు శవపంచనామా నిర్వహించమని కాళ్లవేళ్ల పడి ప్రాధేయపడింది. అయినా కనికరించేలేదు ఆ వైద్యుడు. పోస్టుమార్టం చేయాలంటే రూ.16వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోన్​ పే చేయమని చెప్పి నెంబర్ ఇచ్చి వైద్య వృత్తికే కలంకం తెచ్చాడు. అన్ని విధాలుగా ప్రాధేయపడి.. విసిగిపోయిన ఆ మహిళ.. చివరకు వైద్యుడు సందాని బాషాపై ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:Ruya Hospital: రుయాలో ఆంబులెన్స్​ మాఫియా.. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన తండ్రి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details