నెల్లూరు పెన్నా నది వరదలో కొట్టుకొచ్చిన వింతజంతువు కళేబరాన్ని.. వైద్యులు పరీక్షించారు. అది పులి గానీ, చిరుత గానీ అయి ఉండవచ్చని అనుమానించిన స్థానికులు... అధికారులకు సమాచారమిచ్చారు. పోలీసు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జంతువు కళేబరానికి పరీక్షలు నిర్వహించారు. అదో మేలు జాతి శునకం అని తేల్చారు.
ఆ వింత జంతువు.. మేలు జాతి శునకం! - పెన్నా నది వరదలు వార్తలు
నెల్లూరు పెన్నా వరదలో కొట్టుకొచ్చిన వింత జంతువు కళేబరానికి వైద్యులు పరీక్షలు చేశారు. అదో మేలు జాతి శునకమని గుర్తించారు.
పెన్నా వరదల్లో కొట్టుకొచ్చిన వింత జంతువు కళేబరం