గత ప్రభుత్వం అవలంభించిన విధానాలనే... ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందని మాజీమంత్రి, భాజపా నేత మాణిక్యాల రావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్తే... దానికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని...ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నెల్లూరుకు వచ్చారు. ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయని కమిటీ నిర్ధారించినట్లు చెబుతున్న ప్రభుత్వం, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో రహస్యంగా జీవో విడుదల చేసి అనంతరం...ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు తెలియజేయాలన్నారు.
'తెదేపా విధానాలనే జగన్ ప్రభుత్వం అనుసరిస్తోంది' - నెల్లూరు జిల్లా
భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నెల్లూరు జిల్లాలో జరిగింది. వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని భాజపా నేత మాణిక్యాలరావు ఆందోళన వ్యక్తం చేశారు.
భాజపా నేత మాణిక్యాల రావు