నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సాంప్రదాయ వేడుకలు జరిగాయి. ఉదయాన్నే తిరుచ్చి ఉత్సవం చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజారోహణ చేశారు.
పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు నిరాడంబరంగా జరిగాయి. వేదమంత్రోచ్ఛరణల నడుమ ధ్వజారోహణ నిర్వహించారు.
లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
కొవిడ్ కారణంగా కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం శేష వాహన సేవ ఉంటుందని ఆలయ సహాయ సంచాలకులు వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు.
ఇదీ చదవండీ.. కడప క్వారీ పేలుళ్ల ఘటనపై.. సంయుక్త నిపుణుల కమిటీ!