నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో 13వ సౌత్ జోన్ నెట్ బాల్ ఆటలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నెట్ బాల్ స్టేట్ జనరల్ ప్రెసిడెంట్ బి.శివరాం ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే ఈ పోటీలు మీట్ లీగ్ కం నాకౌట్ పద్దతిలో జరగనున్నాయి. సౌత్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన మహిళా, పురుషుల జట్లు పోటీల్లో పాల్గొననున్నాయి. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
నెల్లూరులో 13వ సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడలు ప్రారంభం - South Zone Netball Games...started in Nellore
13 వసౌత్ జోన్ నెట్ బాల్ పోటీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రారంభమయ్యాయి. సౌత్ జోన్ పరిధిలోని ఆరు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
13వ సౌత్ జోన్ నెట్ బాల్ క్రీడలు