ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల జలాశయం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల రాకతో.. - నెల్లూరు జిల్లా వార్తలు

Tension situation at Somasila Reservoir: సోమశిల జలాశయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జలాశయం లోతట్టు ప్రాంతాల్లో వలువురు జాలర్లు నిషేధిత అలీవి వలలతో చేపల వేటకు వెళ్లడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సోమశిల జలాశయం వద్ద ఉద్రిక్తత
సోమశిల జలాశయం వద్ద ఉద్రిక్తత

By

Published : Mar 10, 2022, 5:25 AM IST

నెల్లూరు జిల్లా సోమశిల జాలాశయం వద్ద ఉద్రిక్త పరిస్థితుల చోటు చేసుకున్నాయి. జలాశయం లోతట్టు ప్రాంతాల్లో నిషేధిత అలీవి వలలతో చేపలు పట్టేందుకు ఇతర ప్రాంతాల జాలర్లు వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు వారిని అడ్డుకున్నారు. ఎనిమిది అలీవి వలలు, రెండు ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక జాలర్లు ఆందోళనకు దిగారు.

ఓ దశలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమై దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలీవి వలలతో చెపలను వేటాడుతూ కొందరు వ్యాపారులు తమ కడుపు కొడుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

సీఎం సమీక్షలకు పరిమితమయ్యారే తప్ప.. రైతులను ఆదుకోవటం లేదు: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details