Atmakur bypoll : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. భాజపా అభ్యర్థి పోలింగ్ కేంద్రం పరిశీలనకు వచ్చిన సమయంలో.. దొంగ ఓట్లు వేస్తున్న మహిళలను గుర్తించారు. భాజపా అభ్యర్థిని చూసిన మహిళలు వెంటనే సచివాలయంలోకి పరిగెత్తారు. వారిని అనుసరించి సచివాలయంలోకి వెళ్లగా.. వైకాపా నేతలు అతనితో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు జోక్యం చేసి.. ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. దొంగ ఓట్ల వ్యవహారంపై అధికారులకు భాజపా అభ్యర్థి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:బాలయ్య 'అన్స్టాపబుల్'లో మెగాస్టార్.. షారుక్ సినిమాలో రానా!