Protest at Krishnapatnam: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు జెన్‌కో గేటు వద్ద బైఠాయించారు. ప్రయివేటీకరణ టెండర్ల ప్రక్రియను పరిశీలించేందుకు ఈనెల 27న సీఎం జగన్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జెన్‌కో ఎండీ శ్రీధర్, ఎస్పీ, కలెక్టర్ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం వద్దకు రాగా కార్మికులు అడ్డుకున్నారు. జెన్‌కో ప్రైవేటీకరణను విరమించుకోవాలని, టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.
కృష్ణపట్నంలో థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికుల ఆందోళన - ఏపీ లేటెస్ట్
Protest at Krishnapatnam: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ జెన్‌కో వద్ద ఉద్యోగులు బైఠాయించారు. టెండర్ల ప్రక్రియను నిరసిస్తూ జెన్‌కో గేటు వద్ద నిరసన తెలిపారు. ఈ నెల 27న సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన జెన్‌కో ఎండీ శ్రీధర్, ఎస్పీ, కలెక్టర్లను అడ్డుకున్న కార్మికులు ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
genco