నెల్లూరు జిల్లా బంగారంపేట సమీపంలోని అటవీప్రాంతంలో.. కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పది మంది పందెం రాయుళ్లని అదుపులోకి తీసుకున్నట్లు పెళ్లకూరు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. 20 ద్విచక్రవాహనాలతో పాటు రూ. 4 వేల నగదు, ఐదు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి..పది మంది అరెస్టు - బంగారంపేటలో కోడిపందేల నిర్వహణ
కోడి పందేలు నిర్వహిస్తున్న పది మందిని..నెల్లూరు జిల్లా పెళ్లకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారంపేట అటవీ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి.. రూ. 4 వేల నగదుతో పాటు ఐదు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

బంగారంపేటలో పందెంరాయుళ్లు అరెస్ట్