నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం నుంచి కామిరెడ్డిపాడు గ్రామానికి అక్రమంగా మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామిరెడ్డిపాడు గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి గతంలో అదే గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉండటంతో అబ్దుల్ ఖాదర్‌కు మద్యం దొరక్క తన వ్యాపారం మందగించింది. కొత్తగా ఆలోచించిన అతను ఉదయాన్నే అనంతసాగరం చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉండి అప్పుడప్పుడు ఒక్కో బాటిల్ మద్యం షాప్ నుంచి కొనుగోలు చేసేవాడు. అనంతరం వాటన్నింటిని తీసుకుని గ్రామానికి చేరుకుని అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఇతని అక్రమ వ్యాపారంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇటీవల పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. అనంతసాగరంలోని బస్టాండ్ వద్ద మద్యం బాటిల్లతో సహా అబ్దుల్ ఖాదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి పది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
అనంతసాగరంలో పది మద్యం సీసాలు స్వాధీనం - అనంతసాగరం మద్యం పట్టివేత న్యూస్
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం నుంచి కామిరెడ్డిపాడు గ్రామానికి అక్రమంగా మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి పది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
![అనంతసాగరంలో పది మద్యం సీసాలు స్వాధీనం http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/16-December-2019/5396316_160_5396316_1576520433781.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5396316-160-5396316-1576520433781.jpg)
అనంతసాగరంలో పది మద్యం సీసాలు స్వాధీనం