యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద పండ్లు అమ్ముతూ ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్ధి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు.
ఉద్యోగాలు కల్పించాలంటూ కూరగాయలు అమ్ముతూ తెలుగు యువత నిరసన - protest in nayudupeta
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగు యువత నేతలు ఆందోళన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
![ఉద్యోగాలు కల్పించాలంటూ కూరగాయలు అమ్ముతూ తెలుగు యువత నిరసన telugu-yuvatha-leaders-protest-in-nayudupeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11341196-862-11341196-1617966202364.jpg)
ఉద్యోగాలు కల్పించాలంటూ కూరగాయలు అమ్ముతూ నిరసన