ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పథకాల పేర్లు మార్చినట్లు రాజధానిని మారుస్తారా' - నెల్లూరు తెలుగు యువత

గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు మార్చినట్లు.. వైకాపా ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తోందని నెల్లూరు జిల్లా తెలుగు యువత నాయకులు విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

telugu yuvatha criticises ycp government about three capitals in nellore
హైకోర్టు చిత్రపటానికి తెలుగు యువత పాలాభిషేకం

By

Published : Aug 5, 2020, 5:46 PM IST

మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నిర్వీర్వం చేస్తోందని తెలుగు యువత ఆరోపించింది. 3 రాజధానులపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తూ నెల్లూరులో తెలుగు యువత నాయకులు న్యాయస్థానం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతోపాటు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని జిల్లా కోఆర్డినేటర్ తిరుమల నాయుడు విమర్శించారు. 3 రాజధానుల విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చినట్లు, రాజధానిని మార్చాలని చూడడం తగదన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details