ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాతృభాషా దినోత్సవంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు - Telugu language day celebrations at districts

రాష్ట్ర వ్యాప్తంగా మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతికి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 22న సెలవు దినం కావడం వల్ల ముందుగానే ఈ వేడుకలు చాలా ప్రాంతాల్లో చేసుకున్నారు.

Telugu language day celebrations at districts
మాతృదినోత్సవం సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు

By

Published : Feb 20, 2020, 11:04 PM IST

మాతృభాషా దినోత్సవం సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

కర్నూలులోని మాంటిస్సోరీ పాఠశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈనెల 22న శివరాత్రి సందర్భంగా సెలవు రావడం వల్ల మాతృభాష వేడుకలను ముందుగానే చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి:

వెలిగొండ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details