సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా నెల్లూరు, చిత్తూరు జిల్లాల తెలుగు రైతు అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాధాకృష్ణ నాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. నేటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాలో పెన్నా, సంగం బ్యారేజీ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు.
తెదేపా హయాంలో పెన్నా బ్యారేజీ పనులు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులను వైకాపా ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేకపోతుందన్నారు. సంగం బ్యారేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికే 69శాతం నిర్మాణం పూరైన పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించి.. త్వరగా పూర్తి చేయాలని తెలుగు రైతు అధ్యక్షులు డిమాండ్ చేశారు.
'సోమిరెడ్డిపై కేసు.. విడ్డూరం'