నెల్లూరులో తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు కానుంది. మైసూర్ లో ఉన్న ఈ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కమిటీ జిల్లాలో పర్యటించింది. నాలుగు ప్రాంతాల్లో స్థల పరిశీలన చేసిన కమిటీ సభ్యులు నివేదికను కేంద్రానికి అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రాంతంలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కమిటీ సభ్యుడు రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవడం వల్లే తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరుకు వస్తోందని తెలిపారు.
నెల్లూరుకు తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం - Nellore
మైసూరులో ఉన్న తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరులో ఏర్పాటు కానుంది. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించేందుకు కేంద్ర కమిటీ జిల్లాలో పర్యటించింది. త్వరలో నివేదికను కేంద్రాన్ని అందించనున్నారు.
నెల్లూరుకు తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం
TAGGED:
Nellore