తెలంగాణలోని దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఎన్నికల ఫలితం.. తిరుపతి ఉప ఎన్నికలో పునరావృతం అవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట కె.కె.కల్యాణ మండపంలో జరిగిన మేథావుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కొన్ని కారణాల కారణంగా ఆగిందని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపిస్తే.. కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. ఏపీ పరిషత్ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని.. ఏపీలో భాజపా ప్రత్యామ్నాయం అవుతుందని రఘునందన్ రావు చెప్పారు.