నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ చవటపాలెంలో హత్యాచారానికి గురైన మతి స్థిమితం లేని యువతి కుటుంబ సభ్యులను జిల్లా తెదేపా ఇంఛార్జీ, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్లు పరామర్శించారు. చవటపాలెంలో మహిళలు బయట రావాలనే భయపడాల్సి వస్తుందన్నారు. మానవ మృగాలకు శిక్ష పడాలని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు.
హత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి తెదేపా రూ.2 లక్షల ఆర్థిక సహాయం - నెల్లూరులో అత్యాచారం,హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించిన తెదేపా
నెల్లూరు జిల్లాలో హత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని యువతి కుటుంబానికి తెదేపా నేతలు అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు జిల్లా తెదేపా ఇంఛార్జీ, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు.

అత్యాచారం,హత్యగురైన యువతి కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం
హత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి తెదేపా రూ.2 లక్షల ఆర్థిక సహాయం
ఇవీ చదవండి: