ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం రూపంలో.. ప్రజల రక్తం తాగుతున్నారు: అమర్​నాథ్​ రెడ్డి

తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మితో పాటు మాజీ మంత్రి అమర్​నాథ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్​.. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో తిరుపతి ఉపఎన్నికల ప్రచారం చేశారు. సీఎం జగన్ రెండేళ్ల పాలనలో.. మద్యం ధరలు పెంచి, రేషన్ కార్డులు తొలగించాలని చూస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమర్​నాథ్​ రెడ్డి విమర్శించారు.

By

Published : Apr 6, 2021, 8:15 PM IST

ex minister amarnath reddy allegations on cm jagan, tdp tirupati bi polls campaign in chillakuru
సీఎం జగన్​పై మాజీ మంత్రి అమర్​నాథ్​ రెడ్డి విమర్శలు, చిల్లకూరులో తెదేపా ఉపఎన్నికల ప్రచారం

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి పర్యటించారు. సైకిల్ తొక్కి ఓటర్లను ఆకటుకున్నారు. మాజీ మంత్రి అమర్​నాథ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీఎం జగన్ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తామన్నారు కానీ.. చేశారా? అని అమర్​నాథ్​రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి సొంత బ్రాండ్​ల పేరుతో మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. రూ. 60 ఉన్న క్వార్టర్ బాటిల్​ను రూ. 200కు విక్రయిస్తూ.. ప్రజల రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తెదేపాని గెలిపిస్తే ముఖ్యమంత్రికి నెత్తికెక్కిన కళ్లు దిగివస్తాయన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details