నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం చేపట్టిన రెండు సాగునీటి పనుల రివర్స్ టెండర్లలో.. రూ. 10 కోట్ల మేర చేతులు మారి ఉంటాయని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆదేశాలతోనే ఈ టెండర్లు జరిగాయని చెప్పారు.
రివర్స్ టెండర్ల పేరుతో వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఆదా అవుతుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. జిల్లాలో దాదాపు 50 కోట్ల రూపాయల అంచనాలతో.. 2 కాలువ పనులను రివర్స్ టెండరింగ్ లో 4.5 శాతం ఎక్కువ మొత్తానికి కట్టబెట్టారని ఆరోపించారు. పది శాతానికి పైగా తక్కువగా జరగాల్సిన పనులను రివర్స్ పేరుతో ఎక్కువకు ఇవ్వడం దారుణమన్నారు.