నెల్లూరు జిల్లాలో కొన్ని వైద్యశాలలు, డాక్టర్లు కలిసి మాఫియా నడిపిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని పార్టీ కార్యలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాధితులను భయాందోళనకు గురిచేసి ఆక్సిజన్ అవసరం ఉన్నా, లేకున్నా ఇవ్వటం.. రెమిడిసివర్ ఇంజక్షన్లు అధిక ధరకు విక్రయిస్తూ బాధితులను దోచుకుంటున్నారని ఆయన తెలిపారు. రెమిడిసివర్ ఇంజక్షన్లు కాకుండానే లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారని, హాస్పిటల్ పేరుతో కాకుండా తెల్లకాగితంపై బిల్లు మొత్తం రాసిస్తున్నారని విమర్శించారు. హాస్పిటల్ లో దోపిడీ జరుగుతున్నా, పేదల మందులు బయట బ్లాక్ లో అమ్ముకుంటున్నా మంత్రులు, ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.
నెల్లూరులో మెడికల్ మాఫియా.. - tdp leader Anam Venkataramana Reddy latest news
నెల్లూరు జిల్లాలో మెడికల్ మాఫియా తయారైందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యే సహకారంతో నగరంలో ఈ మాఫియా నడుస్తోందని విమర్శించారు.
తెదేపా నేత ఆనం వెంకటరమణా రెడ్డి