ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఐదు కోట్ల మందికి మేలు జరిగేలా తి‌రుపతి ఓట‌ర్లు తీర్పు ఇవ్వాలి' - nadendla brahmam chaudhary latest news

వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందితే..వారి కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించకపోవటం చాలా బాధాకరమన్నారు.

nadendla brahmam chaudhary
నాదెండ్ల బ్రహ్మం చౌదరి

By

Published : Dec 23, 2020, 4:58 PM IST

రాష్ట్రంలో వైకాపా అవినీతి పరిపాలనలో అభివృద్ధి కుంటుపడిందని.. యువతకు ఉపాధి లేకుండా పోయిందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట తెదేపా కార్యాలయంలో నేడు ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రజలు విజ్ఞతతో ఓటేసి వైకాపాను ఓడిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి పని తీరు బాగాలేదని ఓటుతో నిరూపించాలన్నారు. ఐదు కోట్ల మందికి మేలు జరిగేలా తి‌రుపతి ఓట‌ర్లు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందితే కనీసం ఆ కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించకపోవటం బాధాకరమన్నారు.

ABOUT THE AUTHOR

...view details