కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడారు. కరోనా బాధితులు ఆసుపత్రుల్లో పడకలు లేక ఇబ్బంది పడుతున్నారని.. ఆక్సిజన్ అందక మృతిచెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్నా.. పడకలు, ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. మహమ్మారి కట్టడిలో విఫలమైన జగన్... ప్రజలను అప్రమత్తం చేస్తోన్న చంద్రబాబుపై కేసు బనాయించడం దారుణమన్నారు.