కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నందున, మద్యం దుకాణాలు మూసివేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. మద్యం దుకాణాలు తెరవక ముందు పదుల సంఖ్యలో వచ్చిన పాజిటివ్ కేసులు, ఇప్పుడు వేల సంఖ్యకు చేరాయని తెదేపా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ విస్తరించకుండా గుడులు, బడులు మూసేసిన ప్రభుత్వం, మద్యం దుకాణాలను మాత్రం అనుమతివ్వడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిరోజు 10 వేలకుపైగా కేసులు నమోదు అవుతుండటంతో మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు.
మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా నిరసన - covid cases in nellore
నెల్లూరులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో పలువురు అనవసరంగా రోడ్డపై తిరుగుతున్నారని.. మద్యం దుకాణాల ముందు తాగుబోతులు కనీసం భౌతిక దుారం కూడా పాటించడం లేదన్నారు తెదేపా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి. దీంతో కరోనా కేసులు పెరుగుతాయని మండిపడ్డారు.
నెల్లూరులో మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా నిరసన