ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీట మునిగేచోట ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దు: తెదేపా

నెల్లూరులో తెదేపా నేతలు వినూత్న నిరసన చేపట్టారు. నీట మునిగే చోట ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దంటూ బోటు, లైఫ్ జాకెట్ వేసుకొని నగరంలోని పెన్నా నది పక్కన ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల వద్ద ధర్నా చేపట్టారు.

నీట మునిగే చోట ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దు: తెదేపా
నీట మునిగే చోట ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దు: తెదేపా

By

Published : Nov 8, 2020, 4:17 PM IST

నీట మునిగేచోట ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దంటూ నెల్లూరులో తెదేపా నేతలు వినూత్న నిరసన చేపట్టారు. బోటు, లైఫ్ జాకెట్ వేసుకొని నగరంలోని పెన్నా నది పక్కన ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల వద్ద ధర్నా చేపట్టారు. ఇటీవల వచ్చిన స్వల్ప వరదకే ఇళ్ల స్థలాలు నీట మునిగాయని..భారీ వరద వస్తే పేదలు నిర్మించుకునే ఇళ్ల పరిస్థితి ఏంటని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.

గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల లేఅవుట్ లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరిలోగా పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే తామే లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details