ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ తెదేపా దీక్ష - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు నగరంలోని మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నివాసంలో తెదేపా నేతలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.

tdp protest in nellore
tdp protest in nellore

By

Published : Sep 7, 2020, 7:58 PM IST

ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఒకరోజు దీక్ష చేపట్టింది. నగరంలోని మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ నివాసంలో ఈ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. నగర, రూరల్ తెదేపా ఇంఛార్జ్​లు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో.. పుట్టి ధాన్యాన్ని తొమ్మిది వేల రూపాయలకే అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్​కు నగదు బదిలీ అంటూ.. రైతాంగాన్ని మోసగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతన్నకు నష్టం జరిగితే ఉద్యమిస్తామని వారు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details